గోడలపంపు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్

by Aamani |
గోడలపంపు గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
X

దిశ,ఆదిలాబాద్: ఖానాపూర్ మండలంలోని గోడలపంపు గ్రామంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ పారుఖి శుక్రవారం సందర్శించారు. కరోనా పాజిటివ్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. గ్రామ ప్రజలతో, విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించినందున ఎవరు బయటకు వెళ్లవద్దని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలను పాటించాలని, మాస్కులు ధరించాలన్నారు. బాధితుడు ముంబై నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల వద్దనే ఉన్నాడని, వారికి కూడా కరోనా వైద్యపరీక్షలు నిర్వయించాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ వెంట తహిశీల్దార్ నారాయణ ఉన్నారు.

Advertisement

Next Story