భారీ వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలన్న సూర్యాపేట జిల్లా కలెక్టర్

by Shyam |
Suryapet Collector Vinay Krishna Reddy
X

దిశ, సూర్యాపేట: జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుట వలన వాతావరణ శాఖ 48 గంటలలో ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసినందున జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు, మూసి నది వరద నీరుతో ఉదృతంగా ప్రవహించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా నీటి పారుదల, వ్యవసాయ విద్యుత్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed