పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల రక్తదానం

by Shyam |
పశు సంవర్ధక శాఖ ఉద్యోగుల రక్తదానం
X

దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా పశు సంవర్ధకశాఖ ఉద్యోగులు శనివారం రక్తదానం చేశారు. జిల్లా కేంద్రంలోని అసుపత్రిలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రారంభించారు. అందులో భాగంగా ఉద్యోగులు రక్తదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవి కాలంలో రక్తం కొరత తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తలసేమియా, డయాలసిస్ రోగులకు, ట్రామా కేసులకు రక్తం కొరత ఏర్పడకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Kamareddy,collector Sharath,blood dontation camp,Red cross

Advertisement

Next Story