‘కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి’

by Shyam |
‘కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి’
X

దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, మొజామ్మిల్ ఖాన్, డీఆర్డీఏ గోపాల్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్, డీయస్ఓ శ్రీనివాస్ రెడ్డి, డీఎం మనోహర్, ఐకేపీ ప్రతినిధులు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 వేల టార్పలిన్ కవర్లను జిల్లాకు తెప్పించనున్నామనీ, వీటిని ఒక్కో కొనుగోలు కేంద్రానికి 30 చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. 350 కొనుగోలు కేంద్రాలకు గానూ 350మంది ట్యాబ్ అపరేటర్లను నియమించి, వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వీరు ప్రతి కొనుగోలు కేంద్రంలో కావాల్సిన వసతుల వివరాలు తెలుసుకొని సంబంధిత నివేదికను ఎప్పటికప్పుడూ అందజేయలన్నారు. టోకెన్ కేటాయింపుల నుండి అకౌంట్లో డబ్బులు పడేవరకూ పరిశీలించాలన్నారు. అలాగే, ప్రతి రైస్ మిల్ వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వీరు 45 రోజులు రైస్ మిల్లుల వద్దనే ఉంటూ పూర్తి సమాచారాన్ని తెలుసుకొంటూ సమన్వయ పరచాలన్నారు. ఎంత ధాన్యం రావాల్సి ఉంది, ఎంత వచ్చింది, ఎంత కొనుగోలు చేశాము, గన్నీ బ్యాగులు ఎన్ని అవసరం ఉన్నాయి.. వంటి వివరాలతో కూడిన ప్రత్యేక ఫార్మేట్‌లను రూపొందించాలన్నారు. ప్రతిరోజూ రిపోర్టులను అందజేయాలని ఆదేశించారు.
tags:medak, crop buy centres, coronavirus, outbreak, collector venkatram reddy, AO, DSO, LKP

Advertisement

Next Story

Most Viewed