- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎంపీడీవోల పనితీరులో మార్పురావాలి’
దిశ, మెదక్: గ్రామాల్లో చాలా వరకు అభివృద్ధి పనులు జరగడం లేదని, ఈ విషయంలో ఎంపీడీవోలు తమ పనితీరును మార్చుకోవాలని, లేనట్టయితే చర్యలు తప్పవని కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్లో జిల్లాలోని ఎంపీడీవోలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం, చుట్టుపక్కల ప్రాంతలను పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని, ఇది ఎంతో మంచి పరిణామమని కలెక్టర్ అభినందించారు. దీనిలో సర్పంచ్‌లు సెక్రెటరీల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. వర్షకాలంలో కూడా తండాల్లో ఇదే స్ఫూర్తితో పనులు చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఉన్న బోర్ల వివరాలను సేకరించాలని, నిరుపయోగంగా బోరు గుంతలను తక్షణం పూడ్చివేయించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లోని ఆయా నర్సరీలో మొక్కలు పెంచాలని, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించాలని తెలిపారు.