- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా వైద్యం’
దిశ, ఆదిలాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో గర్భిణుల నమోదు, జరుగుతున్న ప్రసవాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో అధిక సంఖ్యలో ప్రసవాలు జరగేలా డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు కృషి చేయాలని అన్నారు. ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయాలని అందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై పూర్తి నమ్మకం కలిగేలా డాక్టర్లు పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగితే కేసీఆర్ కిట్‌తో పాటు మగ శిశువు అయితే రూ.12000, ఆడ శిశువైతే రూ.13000 నగదు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్ట పోకుండా ప్రజలకు వైద్యసిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వసంతరావు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, డాక్టర్ కార్తీక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.