- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ హనుమంతు
దిశ, వరంగల్: గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం భద్రకాళి ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 65 కోట్లతో భద్రకాళి ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులను చేపట్టినట్టు తెలిపారు. అసంపూర్తి పనులను నాణ్యతతో గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. నగరంలోని స్మార్ట్ రోడ్ల ప్యాకేజీ 4 లో భాగంగా చేపడుతున్న నాలుగు రోడ్ల పనుల ప్రగతిని పరిశీలించి వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే మెన్ మెటీరియల్ భారీగా సమకూర్చుకునేలా కాంట్రాక్టర్లకు దేశాలు జారీ చేసి నిర్ధేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఈ భాస్కర్, కుడా ప్రణాళిక అధికారి అజిత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు విద్యాసాగర్, డీఈలు పాల్గొన్నారు.
Tags: Warangal,collector,Rajiv Gandhi Hanumanthu, Inspect,Smart city Works