స్వర్ణ ప్యాలస్ ఘటనపై విచారణకు కమిటీ -కలెక్టర్ 

by srinivas |   ( Updated:2020-08-10 04:30:18.0  )
స్వర్ణ ప్యాలస్ ఘటనపై విచారణకు కమిటీ -కలెక్టర్ 
X

స్వర్ణ ప్యాలస్ ఘటనపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజయవాడలో ఏర్పాటైన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో తనిఖీల కోసం బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు 18, కోవిడ్ కేర్ సెంటర్లు 36 ఉన్నాయి అన్నారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు, అగ్ని ప్రమాదం జరిగితే సహాయక చర్యలు, భద్రతా ప్రమాణాలు గుర్తించటానికి బృందాలను రంగంలోకి దింపినట్లు చెప్పారు.

అగ్నిప్రమాదానికి సంబంధించిన విచారణకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీలు ఏర్పాటు చేసిన రెండు వారాల్లో నివేదిక అందేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఘటనకు సంబంధించి దారితీసిన అంశాలను విచారణ చేసేందుకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), ఎల్.శివశంకర్ నేతృత్వంలో విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, విఎంసి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా.జి.గీతాబాయ్, విఎంసికి చెందిన ఆర్ ఎఫ్ ఓ టి.ఉదయకుమార్, సిపిడిసిఎల్ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ తో కూడిన కమిటీని నియమిస్తూ కలెక్టర్ ఇంతియాజ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed