- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతులను బాధ పెట్టొద్దు: కలెక్టర్ అనితా రామచంద్రన్
by Shyam |
దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు, మిల్లర్లు రైతులను బాధపెట్టొద్దని, వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ముత్యారెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామ పంచాయతీలను సందర్శించి, అక్కడి నర్సరీలను పరిశీలించారు. కూలీల అటెండెన్స్, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకుని వారికి శానిటైజర్లు పంపిణీ చేశారు.
tags : rice purchasing centers, visit, collecter anitha ramchandran, yadadri
Advertisement
Next Story