- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తుమ్మల వర్సెస్ పువ్వాడ.. మరో చిచ్చు పెట్టిన బస్టాండ్
దిశ, ఖమ్మం: అధికార పార్టీలో నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్దం మరోసారి బయటపడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న గ్యాప్‌తో పార్టీ క్యాడర్‌కు గులాబీ ముళ్లులు కుచ్చుకుంటాన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అధికార పార్టీ గ్రూప్ తగాదాలు ఎక్కడో ఓ చోట బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య ఉన్న కోల్ద్ వార్ బయట పడింది. ఈ ఇద్దరి మధ్య సంధి కుదిర్చేందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని స్పష్టంగా కనిపిస్తోంది.
ఖమ్మం జిల్లాను తమ నేత అభివృద్ది చేశారని తుమ్మల వర్గీయులు…. లేదు తమ నేతే అభివృద్ది చేశారని పువ్వాడ వర్గీయుల మధ్య ముద్దం సోషల్ మీడియాలో, బహిరంగంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ప్రకటించాలని సీఎం, కాంగ్రెస్, ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు పాత బస్టాండ్ పరిరక్షణ కమిటీగా ఏర్పడి దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ప్రకటించుకునే విధంగా పరిరక్షణ కమిటీ నేతలు ఆదివారం ఖమ్మంలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వద్దకు వెళ్లి వినతి పత్రం అందజేశారు. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు పరిరక్షణ నేతల మధ్య సాగిన సంభాషణ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మల నాగేశ్వర రావు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది, నూతన బస్టాండ్ నిర్మించి పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ప్రతిపాదించే విధంగా చేసిన ప్రయత్నాలను తుమ్మల నాగేశ్వర రావు వారికి వివరించారు. దీంతో తుమ్మల మాట్లాడిన తీరును పువ్వాడ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కొత్త బస్టాండ్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాటలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం నగరానికి హైటెక్ బస్టాండ్ నిర్మాణం కోసం 2015లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ మొదటి సారిగా జిల్లాకు వచ్చినప్పుడు ఎన్ఎస్పీ స్థలం చూపించి బస్టాండ్ కోసం సీఎంను ఒప్పించి 7.9 ఎకరాల స్థలాన్ని కేటాయించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. నగర నడిబొడ్డులో ఉన్న పాత బస్టాండ్ ప్రయాణికులకు సరిపోవడంలేదని, ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఖమ్మం నగరానికి మరో హైటెక్ బస్టాండ్ నిర్మించాలని ఆలోచ చేశామని అన్నారు. పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో బైపాస్ రోడ్డులో హైటెక్ బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ ద్వారా శంకుస్థాపన చేయించామని అన్నారు. తాను ఉంటే మాత్రం పాత బస్టాండ్‌ను లోకల్ బస్టాండ్‌గా ఉపయోగిస్తామని తుమ్మల వ్యాఖ్యానించారు. కొత్త బస్టాండ్‌లో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, హైటెక్, రాజధాని, ఏసీ బస్సులను నడిపేందుకు ప్రతిపాదించామని తెలిపారు.
ఖమ్మం పట్టణాన్ని నగరంగా అభివృద్ది చేయటంతో పాటు మున్సిపాలిటీను కార్పొరేషన్ హోదా కల్పించి నగర ప్రజలకు శాశ్వత మంచినీటి పరిష్కారం కోసం పాటుపడినట్లు తెలిపారు. దాంతో పాటు త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న గొల్లపాడు ఛానల్ పరిష్కారం కోసం మఖ్యమంత్రిని ఆ ప్రాంతాల్లో పర్యటించే విధంగా చేసి గొల్లపాడు ఛానల్ వాసులకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పించిన ఘనత తనదేనని అన్నారు. ఖమ్మం నగరాన్ని ఆధునిక హంగులతో అభివృద్ది చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగానే అభివృద్ది జరుగుతోందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి ఐటీ హబ్‌కు పునాది వేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోడ్ల విస్తరణ, రాష్ట్రానికి వచ్చే విధంగా ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్డు తెచ్చామని మంత్రి గుర్తు చేశారు. ఖమ్మం టూ సూర్యాపేట ఫోర్‌లైన్ కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి నేషనల్ హైవేతో అనుసంధానం చేసి నిధులు ముంజూరు చేయించామని తుమ్మల తెలిపారు. పరిరక్షణ కమిటి సభ్యులతో తాను చేసిన పనులను వారికి చెప్పుకున్నారు.