- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సహజీవనాన్ని ఆమోదించలేం: పంజాబ్ హైకోర్టు
చండీగఢ్: సహజీవన(లివ్‌ఇన్ రిలేషన్‌షిప్) సంబంధాన్ని నైతికంగా, సామాజికంగా అంగీకరించలేమని పంజాబ్, హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న ఓ జంటకు రక్షణ కల్పించడానికి తిరస్కరించింది. యూపీకి చెందిన 19ఏళ్ల యువతి, 20ఏళ్ల పంజాబీ యువకుడు నాలుగేళ్లుగా కలిసి ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ, యువతి కుటుంబం నుంచి బెదిరింపులు రావడంతో పంజాబ్ పోలీసులను ఆశ్రయించారు.
అయినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. తమ ప్రాణాలకు, జీవించే హక్కను కాపాడేలా పోలీసులకు సూచనలు చేయాల్సిందిగా వారు పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ, ఈ పిటిషన్ ద్వారా ఆ జంట సహజీవన సంబంధానికి ఆమోదాన్ని పొందగోరుతున్నదని జస్టిస్ హెచ్‌ఎస్ మదన్ ధర్మాసనం తెలిపింది. సహజీవనాన్ని నైతికంగా, సామాజికంగా అంగీకరించలేమని, కాబట్టి, వారికి రక్షణ కల్పించడం సాధ్యపడదని పిటిషన్‌ను తోసిపుచ్చింది.