- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల హత్య కేసులో కోడిపుంజు అరెస్ట్..
దిశ, జగిత్యాల: హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మరణంలో కోడిపుంజు పాత్ర కూడా ఉండడంతో పోలీసులో కస్టడీలోకి తీసుకున్నారు. మనిషి కోసుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే మరీ…
జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు ఓ కోడి పుంజును అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే దానికి దాన వేస్తూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో ఇటీవల కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పందెం రాయుళ్లు. పందెం కోసం సిద్ధం చేసిన కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తయ్య హత్య కేసును విచారిస్తున్న క్రమంలో ఇందుకు కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ కోడిని ఫాంకు పంపించాం :ఎస్సై జీవన్
కోడి పందెం నిర్వహిస్తుoడగా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించిన కేసు దర్యాప్తులో భాగంగా కోడి పుంజుని సంరక్షించాల్సిన బాధ్యత పోలీస్ వారిపై ఉందని గొల్లపల్లి ఎస్సై బి.జీవన్ ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగానే కోడిని కోళ్ల ఫారంలో సంరక్షణ నిమిత్తం అప్పగించామన్నారు. కోడిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కాని జరగలేదని వివరించారు.