క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్..

by srinivas |   ( Updated:2021-12-25 02:44:02.0  )
క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్..
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్ కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. మూడో రోజు శనివారం పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేసి తనయుడు సీఎం వైఎస్ జగన్‌కు తినిపించారు. అనంతరం చర్చి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చర్చి కాంపౌండ్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను సీఎం ప్రారంభించారు. అలాగే ప్రత్యేక క్యాలెండర్‌ను సైతం సీఎం ఆవిష్కరించారు. క్రిస్మస్‌ పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్‌ అనేది ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని జగన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed