- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
దిశ, హైదరాబాద్:
కరోనా వైరస్ కారణంగా మూడ్రోజులుగా జనజీవనం స్థంభించడంతో ప్రజలు వారి వారి రోజువారీ విధులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వమే ఆదివారం జనతాకర్ఫ్యూ నిర్వహించడం, ఆ సాయంత్రమే లాక్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, సాధారణ పేద, మధ్య తరగతి పేద కుటుంబాలు రోజువారీ జీవనం గడవడం ఇబ్బందిగా మారుతున్నందున ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పింది. ఇదే సందర్భంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కరోనా మహమ్మారి విపత్కాలంగా వచ్చినందున బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. అయినా, పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. అంతే కాకుండా, ప్రయివేటు కంపెనీలు, ఇతర ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేసే కార్మికులంందరికీ ఆయా సంస్థలు పూర్తి వేతనాలు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు చేశారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి కొందరు అండగా ఉండేందుకు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం సహాయ నిధికి విరాళాలు విరివిగా వస్తున్నాయి. అందరికంటే ముందుగా సినీ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళాలను ప్రకటించారు. అనంతరం తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాలు పెద్ద మొత్తంలో పలువురు ప్రకటిస్తూ వారి దాతృత్వాన్ని ప్రకటించుకుంటున్నారు. అందులో విజయా డైరీ ఛైర్మన్ లోకా భూమా రెడ్డి రూ.5 లక్షలు, టీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి రూ.లక్ష, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రూ.2.5 లక్షలు ప్రకటించగా, తెలంగాణ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ ఉద్యగుల సంఘం పక్షాన ఒకరోజు వేతనం దాదాపు రూ.48 కోట్లు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ సతీమణి అనుపమ, ఆమె తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్.. సీఎం సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళాలను అందజేశారు. ఈ సందర్భంగా వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
Tags: cm relief fund, hyderabad, corona helping hand