కాంగ్రెస్ గజ్వేల్ సభపై సీఎం ఆరా.. వచ్చేనెలలో టీఆర్ఎస్ భారీ సభ..?

by Shyam |   ( Updated:2021-09-18 10:13:02.0  )
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. శుక్రవారం ఒకేసారి రెండు జాతీయ పార్టీలు భారీ సభలను నిర్వహించాయి. ఈ సభల నుంచి కేసీఆర్​ను టార్గెట్​ చేసి సవాళ్లు, ఆరోపణలు గుప్పించారు. మొన్నటి వరకు కొంత స్తబ్ధుగా ఉన్న పొలిటికల్​ సీన్​.. ఈ రెండు సభలతో మారిపోయింది. మొన్నటిదాకా ప్రగతిభవన్​లో సంక్షేమ పథకాలపై రివ్యూలతో బిజీగా ఉన్న సీఎం కూడా ఫాంహౌస్​కు వెళ్లారు. అయితే సీఎం ఫాంహౌస్​కు కూతవేటు దూరంలో కాంగ్రెస్​ భారీ సభను నిర్వహించింది. సీఎం ఇలాకాలో కాంగ్రెస్​ జెండాలు రెపరెపలాడాయి. మరోవైపు నిర్మల్​లో బీజేపీ అమిత్​షా సభను నిర్వహించింది. ఈ రెండు సభలు కూడా కేసీఆర్​ టార్గెట్​గానే జరిగాయి. దీంతో గులాబీ బాస్​ కూడా కీలక సభపై ఫోకస్​ పెట్టినట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్లీనరీతోనే రిప్లై

ప్రస్తుతం ప్రతిపక్షాల ఆరోపణలు జోరందుకున్నాయి. నిరుద్యోగుల అంశాన్ని కాంగ్రెస్​ లేవనెత్తనుండగా.. ఇప్పటికే బీజేపీ ఆందోళనలకు కూడా దిగింది. ఇదే సమయంలో దళిత బంధును వ్యతిరేకించకుండానే.. ఇన్నేండ్లు ఎన్ని నిధులిచ్చారనే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ పార్టీ కూడా భారీ సభకు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం వాస్తవానికి గతంలోనే టీఆర్​ఎస్​ ప్లీనరీ నిర్వహించాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్నారు. ఈ ప్లీనరీని నిర్వహించేందుకు ఇప్పుడు సరైన సమయంగా గులాబీ బాస్​ భావిస్తున్నారు. ఓవైపు టీఆర్​ఎస్​ పార్టీ గ్రామ స్థాయి నుంచి కమిటీల నియామకాన్ని చేపట్టింది. ఆ తర్వాత మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు కమిటీల కూర్పుపై కొంత నిర్లక్ష్యంగా ఉన్నా.. ఇప్పుడు అత్యవసరంగా హడావుడి మొదలుపెట్టారు. కాంగ్రెస్​, బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటం, రెండు భారీ సభలను నిర్వహించడం, మధ్యలో షర్మిల, అటు తీన్మార్​ మల్లన్న అంశం కూడా కొంత చర్చగా మారింది. ఇలాంటి సమయంలో ప్లీనరీ పేరుతో భారీ సభను ఏర్పాటు చేసేందుకు గులాబీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో ఇదే సభను నిర్వహించాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు కూడా సమాచారం. ప్రతిపక్షాల విమర్శలకు ప్లీనరీతోనే రిప్లై ఇవ్వాలని టీఆర్​ఎస్​ శ్రేణులు భావిస్తున్నాయి.

ఎలా జరిగింది.. ఎం జరిగింది..?

ఇక కాంగ్రెస్​, బీజేపీ నిర్వహించిన రెండు సభలపై టీఆర్​ఎస్​ పెద్దలు విశ్లేషణలో పడ్డారు. అక్కడ నిర్మల్​ సభ, ఇక్కడ గజ్వేల్​ సభకు జనాల తరలింపు, ఎక్కడి నుంచి భారీగా తరలివచ్చారనే వివరాలను సేకరిస్తున్నారు. గజ్వేల్​ వేదికగా కాంగ్రెస్​ కూడా కేసీఆర్​ గుండెల్లో గునపం దింపినట్లుగా ఉందని ఇప్పటికే టాక్​. అయితే సీఎం ఇలాకాలో ఏర్పాటు చేసిన సభ సక్సెస్​ కావడంపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై పూర్తి నివేదికను సీఎం కేసీఆర్​కు త్వరలోనే ఇవ్వనున్నారు. అంతేకాకుండా నిర్మల్​ సభకు హుజురాబాద్​, కరీంనగర్​ ప్రాంతం నుంచి వెళ్లిన వారిపై అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed