రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా : దీదీ

by Shamantha N |
రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా : దీదీ
X

కోల్‌కతా : కరోనా వ్యాక్సిన్ పంపిణీ తేదీ ఖరారైన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను’ అని ఆమె రాసిన ఓ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే, పోలీసులు, హోంగార్డులు, విపత్తు నిర్వహణ సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తొలి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ప్రాణాలకు తెగించి రాష్ట్ర ప్రజలకు సేవలందించిన కొవిడ్ వారియర్‌లను గుర్తుచేశారు.

దశలవారీ ప్రణాళికకు అనుగుణంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి ప్రధాన్యాత లభించనుంది. రాష్ట్రంలోని సాధారణ పౌరులకూ టీకా అందుతుందని, బెంగాల్ ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాలు త్వరలో బెంగాల్‌కు చేరనున్నట్టు తెలిపారు. ఉచిత వ్యాక్సిన్ హామీని బెంగాల్ ప్రభుత్వమే చేయలేదు. ఎన్నికలు సమీపించిన తరుణం కేరళ, తమిళనాడు ఇది వరకు ఉచిత టీకా హామీనిచ్చాయి. తాజాగా, బెంగాల్‌కూడా ప్రకటించింది. కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీలూ ఇదే తరహాలో ప్రకటనలు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed