కూచ్ బెహర్‌లో మమత పర్యటన..

by Shamantha N |
కూచ్ బెహర్‌లో మమత పర్యటన..
X

దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ నాలుగో విడత పోలింగ్ సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్ల కాల్పుల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, మరో ఓటర్ మరణించినట్లు జాతీయ మీడియా కథనాలు వెడువడాయి. అయితే, కూచ్‌బెహర్ జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాల్పులు జరిగిన ప్రాంతంలో పర్యటించనున్నట్లు సమాచారం. బెంగాల్ హింసాకాండపై సీరియస్ అయిన ఈసీ ఎన్నికలు వాయిదా వేయడంతో పాటు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

టీఎంసీ కార్యకర్తలు కావాలనే అల్లర్లు సృష్టించారని బీజేపీ ఆరోపిస్తుంటే.. కేంద్రం చెప్పినట్లు భద్రతా బలగాలు పనిచేస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం బెంగాల్లో తమ చర్యలను ఆపే వరకు తాను ప్రశ్నిస్తూనే ఉంటానని, ఎలాంటి షోకాజ్ నోటీసులకు తాను భయపడబోనని ఈ సందర్భంగా మమతా చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed