- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మర్డర్ ప్లాన్.. బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. ఇటీవల నందిగ్రామ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీకి కాలుకు గాయమైన విషయం తెలిసిందే. తనపై బీజేపీ గుండాలు దాడి చేశారని ఆమె ఆరోపించారు. అయితే, అవన్నీ అవాస్తవాలని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పరిశీలకులు తేల్చడమే కాకుండా నివేదిక రూపంలో ఈసీకి అందజేశారు.
సింపతి ఓట్ల కోసం మమత కొత్త రాజకీయాలకు తెరలేపారని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ముఖ్యమంత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ తనను చంపడానికి కుట్ర జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం హోంమంత్రి అమిత్ షా చేతిలో కీలు బొమ్మలా మారిందని ఆమె కామెంట్స్ చేశారు. దేశంలో ఎప్పుడు ఎవరినీ అరెస్టు చేయాలో అమిత్ షా నిర్ణయిస్తున్నారన్నారు.