- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు..
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళన తారా స్థాయికి చేరింది. కేంద్రంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు ఎంతకూ కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
#FarmersProtest : Delhi Police Has Put CM #ArvindKejriwal Under House, Tweets #AAP
LIVE Updates: https://t.co/LePd99d6iM pic.twitter.com/WR63yiyn2f
— ABP News (@ABPNews) December 8, 2020
ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. ఇంట్లో నుంచి ఎవరినీ బయటకు రానివ్వడం, పోనివ్వడం గానీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతకుముందు కేజ్రీవాల్ రైతుల నిరసన చేస్తున్న సింధ్ ప్రాంతానికి వెళ్లి రైతులను పరామర్శించారు. రైతుల ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి పరోక్షంగా కారణం కావొచ్చనే నేపథ్యంలో ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఢిల్లీ పోలీసులను బీజేపీ పోలీసులుగా ఆప్ నేతలు అభివర్ణిస్తున్నారు.