- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రామస్తులతో నేడు ముఖ్యమంత్రి సహపంక్తి భోజనం
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా జిల్లాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నూతన సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభిస్తున్నారు. తాజాగా.. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాల మర్రిలో గ్రామస్తులందరితో సహపంక్తి భోజనం చేసి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలా ఉండగా, వాసాలమర్రి గ్రామంలోని 2,600 మందితో సీఎం కేసీఆర్ కమ్యూనిటీ లంచ్‌లో పాల్గొన్న అనంతరం గ్రామంలో వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం స్వయంగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు ఫోన్‌లో సూచనలు చేసినట్లు తెలుస్తోంది.