- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్.. ఫ్లాష్.. గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ మరికాసేపట్లో గాంధీ ఆస్పత్రి పరిశీలనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం తొలిసారిగా గాంధీకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్ గాంధీ వైపే వెళ్లలేదు. ప్రస్తుతం గాంధీలో ఆక్సిజన్, వెంటిలేటర్ల సమస్య ఉండటం, కరోనా ఆస్పత్రిగా మార్చిన అనంతరం సౌకర్యాలు లేవంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నాలుగైదుసార్లు గాంధీకి వెళ్లారు. వాస్తవానికి గాంధీలో చికిత్సలపై ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో గాంధీలో ట్రీట్మెంట్కు చేరాలంటూ సెటైర్లు వేశాయి ప్రతిపక్షాలు.
మరోవైపు గాంధీలో కరోనా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని, కనీసం సౌకర్యాలు కల్పించడం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. సిబ్బందికి, రోగులకు, రోగుల సహాయకులకు భోజనాలు కూడా పెట్టడం లేదంటూ శనివారం నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్… వైద్యారోగ్య శాఖ మంత్రిగా గాంధీ ఆస్పత్రి పరిశీలనకు వెళ్తున్నారు. గతంలో గవర్నర్ నరసింహన్ పలుమార్లు గాంధీని పరిశీలించారు. కానీ పరిస్థితులేమీ మారలేదు. ఆ తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గాంధీపై పలుమార్లు వివరాలు తీసుకున్నా స్వయంగా వెళ్లి పరిశీలించలేదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ వెళ్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.