- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన.. బ్రాండ్ మార్చేసిన కేటీఆర్
దిశ ప్రతినిధి, కరీంనగర్, సిరిసిల్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన తనయుడి ఇలాకాలో పర్యటిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ సారి సిరిసిలల్లో పర్యటించిన సీఎం దాదాపు మూడేళ్ల తరువాత మళ్లీ తనయుని ఇలాకాలో పర్యటించనున్నారు.
బ్రాండ్ మార్చేసిన కేటీఆర్..
సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్.. సిరిసిల్ల రూపు రేఖలనే మార్చేశారు. ‘ఉరి’శాలగా మారిన ‘సిరి’శాలలో పెద్ద ఎత్తున నివసిస్తున్న నేతన్నల ఉపాధి కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి సఫలం అయ్యారు. అలాగే 1952 నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు ఇక్కడి నుంచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. తెలంగాణ ఆవిర్బావం తరువాతే అధికార పార్టీతో పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రెడిట్ కేటీఆర్ కొట్టేశారు. రహదారుల నిర్మాణంతో పాటు ఇతరాత్ర అభివృద్ధి పనుల్లో కేటీఆర్ బ్రాండ్‌నే క్రియేట్ చేశారు.
ఇక్కడి నుంచి ఎక్కువ మంది విదేశాలకు వెళ్లి ఉపాది పొందుతున్న విషయాన్ని గమనించి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే నాలుగోది, రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కూల్‌గా రికార్డుకెక్కింది. రూ. 21 కోట్లతో నర్సింగ్ కాలేజీ, మండేపల్లి వద్ద డబుల్ బెడ్ రూం ఇండ్లు, రూ.20 కోట్లతో సర్దాపూర్ వద్ద మార్కెట్ యార్డు, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాలను పూర్తి చేయించారు. ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్ట్యూట్ కూడా సిరిసిల్లలో ఏర్పాటు కానుంది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో వీటన్నింటిని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనయునిగా, మంత్రిగా ఉన్న కేటీఆర్ సిరిసిల్ల అభివృద్ధి విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు.