సీఎం రాకతో కడియం ఇంట్లో పండుగ వాతావరణం

by Shyam |
cm-kcr-kadiyam-srihari 1
X

దిశ‌, కాళోజీ జంక్షన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో హన్మకొండలోని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంట్లో సందడి నెలకొంది. మధ్యాహ్నం భోజనానికి రావాల్సిన సీఎం కడియం ఇంటికి చేరేసరికి నాలుగు దాటింది. ఆ తర్వాత కడియం కుటుంబ సభ్యులతో సీఎం ముచ్చటించారు. కడియం పెద్ద కూతురు డాక్టర్ కడియం కావ్యను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. కావ్య, నజీర్ దంపతులు, రమ్య, శేష దంపతులతో పాటు కడియం తల్లి వెంకటమ్మను భార్య వినయరాణిని పరిచయం చేశారు.

మనవరాళ్లు దియా, మిన్ని, ఆన్య, హానీలను ముఖ్యమంత్రి దీవించారు. రమ్య పెద్ద కూతురు ఆన్య బర్త్ డేను ముఖ్యమంత్రి సమక్షంలో జరిపారు. కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్ కూడా అయిన డాక్టర్ కావ్య తమ సంస్థ నిర్వహించిన కార్యకలాపాల వివరాలతో కూడిన బ్రోచర్‌ను, తన కార్యక్రమాలపై పత్రికల కవరేజీని, తాను వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను ముఖ్యమంత్రి బృందానికి ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed