- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆకస్మిక తనిఖీలు చేస్తానంటూ ఉద్యోగులకు వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్టు తెలిపారు. ఉద్యోగులు ఏ మాత్రం అలసత్వానికి తావివ్వకూడదని కేసీఆర్ హెచ్చరించారు. ఈ పథకాలకు పూర్తి సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు పర్యటన చేయలేదని సీఎం అన్నారు.
ఈ పథకాలను ప్రవేశపెట్టి రెండేళ్లు గడిచిన కారణంగా ఇక రంగంలోని దిగుతున్నటు ప్రకటించారు. పనుల్లో అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే అధికారుల పనితీరును పరిశీలిస్తానని కేసీఆర్ తెలిపారు. జూన్ 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను క్షేత్రస్థాయిలో సమీక్షిస్తాని కేసీఆర్ అన్నారు.
ఈనెల 13న అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో ఈ కార్యక్రమాలపై సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గు ముఖం పట్టిందని.. పాజిటివిటీ రేటు 4.7కు పడిపోయిందని అన్నారు. కరోనా పూర్తిగా తగ్గాక పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం మరో విడతలో పర్యటన చేస్తానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందుకు గానూ ప్రతీ నెల గ్రామాల అభివృద్ధి కోసం రూ. 339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 149 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.