- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కాలక్షేపం కోసమే సీఎం కేసీఆర్ పర్యటనలు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై తనదైన శైలీలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని, అరెస్టులు, వేధింపుల కోసమే అన్నట్లుగా పర్యటన ఉందన్నారు. ప్రజల్ని రోడ్ల మీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు.
కేసీఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే… దాని బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ అక్కడికి పోయే ధైర్యం లేకనే అటుపక్క సిద్ధిపేట జిల్లా, ఇటుపక్క వరంగల్ జిల్లా, పక్కనున్న యాదాద్రి జిల్లా పర్యటన చేస్తున్నట్లు అభిప్రాయం కలుగుతోందన్నారు. ఈ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది వారికీ మంచిది కాదని సూచించారు. అయినా… పేరుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే ప్రచార ఆర్భాటపు సీఎం కాలక్షేపం పర్యటనల వల్ల ప్రజల, నిరుద్యోగుల గతి మారేది ఏమీ లేదని అన్నారు.