సిరిసిల్లలో కేసీఆర్ టూర్.. డబుల్ ఇళ్ల పంపిణీ చేసిన సీఎం

by Sridhar Babu |   ( Updated:2021-07-04 02:09:10.0  )
Kcr-Siricilla
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. మండెపల్లిలో 35 ఎకరాల్లో రూ. 83కోట్ల వ్యయంతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరిగింది. 1,320 మంది లబ్దిదారులకు సీఎం డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆదివారం సిరిసిల్లలో నూతన కలెక్టర్ భవనానికి కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.

Advertisement

Next Story