- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిగతా హీరోలను వదిలేసి కేవలం అల్లు అర్జున్‌నే ఎందుకు అరెస్ట్ చేశారు..? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : సంధ్య థియేటర్‌లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో టైంలో జరిగిన తొక్కిసలాటకి కారణం అల్లు అర్జున్.. అతడ్ని వెంటనే జైల్లో పెట్టండి.. జీవితం మొత్తం జైల్లోనే ఉండేలా శిక్ష వేయండి.. ఇది చాలామంది అంటున్నమాట. దీనికి వాళ్లందరూ చెప్పే కారణం.. అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట వల్లే ఓ తల్లి చనిపోయింది. బిడ్డ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు కాబట్టే అతడికి శిక్షించాలి. ఇది వాళ్ల మాట. అయితే ఓ సినిమా ప్రీమియర్ షోలో కానీ.. లేకపోతే ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ కానీ, ట్రైలర్ లాంచ్ కానీ, ఆడియో లాంచ్ కానీ.. లేదంటే ఎవరైనా హీరో రోడ్ షో, ర్యాలీలు చేసినప్పుడు కానీ.. అందులో చాలామంది ఫ్యాన్స్ ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, చిరంజీవి ఇంకా చాలామంది హీరోల మూవీస్‌కి సంబంధించిన ఈవెంట్లలో, రిలీజ్ టైంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. మరి వాళ్లందరినీ వదిలేసి జస్ట్ అల్లు అర్జున్‌నే ఎందుకు పట్టుకున్నారు..? కేవలం అల్లు అర్జున్‌నే ఎందుకు కార్నర్ చేస్తున్నారు..? అల్లు అర్జున్‌ని కార్నర్ చేయడానికి రీజన్ తెలుసుకునే ముందు.. అసలు ఇంతకుముందు మిగిలిన హీరోల ఈవెంట్లలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం.
మగధీర మూవీ టైంలో పదుల సంఖ్యలో ఫ్యాన్స్ మృతి
2009లో రిలీజైన మగధీర మూవీ టైంలో దాదాపు 10 మంది ఫ్యాన్స్ ఇలాగే థియేటర్ల దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్‌లో చనిపోయారు. ఆగస్టు 2న ముగ్గురు స్టూడెంట్స్ తొక్కిసలాటలో పడి చనిపోయారు. ఆగస్టు 8న ఇద్దరు స్టూడెంట్స్ కరెంట్ షాక్‌తో చనిపోయారు. ఆగస్టు 11న అన్నింటికంటే పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. 2 వేల మంది టికెట్ల కోసం లైన్లో నిలబడగా.. అందులో ఓ పర్సన్ అనుకోకుండా ఎలక్ట్రిక్ బల్బ్‌ని పట్టుకోవడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 22 మంది గాయాలపాలయ్యారు. ఈ ఇన్సిడెంట్‌లో థియేటర్ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ విషాదం
2016లో జూనియర్ ఎన్టీఆర్ బాద్‌షా ఆడియో లాంచ్ ఈవెంట్లో వరంగల్‌కి చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే ఎన్టీఆర్ వీరాభిమాని తొక్కిసలాట వల్ల చనిపోయాడు. ఇంకొంతమంది గాయాలపాలయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చూడాలని అందరూ నెట్టుకుంటూ తొక్కుకుంటూ ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఈ తొక్కిసలాట జరిగింది. రాజు కింద పడడంతో అందరూ తొక్కేశారు. పోలీసులు వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లినా అక్కడ చనిపోయాడు. ఈవెంట్ మేనేజర్లు 12000 నుంచి 15000 వరకు సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చేస్తే 25 వేల మందికి పైగా అటెండ్ అయ్యారు. దీనివల్లే తొక్కిసలాట జరిగింది. ఇక ఓ పర్సన్ చనిపోయిన తర్వాత కూడా ఈవెంట్ కంటిన్యూ చేసింది మూవీ యూనిట్. ఇలా చేయడంపై అప్పట్లో చాలా వ్యతిరేకత కూడా వచ్చింది.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీకి ఒకరు హతం
అదే ఏడాది అంటే 2016లోనే రిలీజైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైంలో అయితే ఏకంగా ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి.. ఓ ఫ్యాన్ ఇంకో ఫ్యాన్‌ని పొడిచి చంపేశాడు.
రామ్ చరణ్ డై హార్డ్ ఫ్యాన్ మృతి
2017లో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే సినిమా కర్నూలు లోని ఎమ్మిగనూరులో ఉన్న శివ థియేటర్లో రిలీజ్ అయిన టైంలో కూడా భారీ తొక్కిసలాట జరిగి.. కన్నయ్య అనే రామ్ చరణ్ డై హార్డ్ ఫ్యాన్ చనిపోయాడు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ కన్నయ్య ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలిచ్చాడు.
చిరంజీవి మూవీకి..
ఇవి కాకుండా చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. అంతెందుకు లాస్ట్ ఇయర్.. 2023లో తమిళ హీరో అజిత్ ఫ్యాన్ ఇలాగే చనిపోయాడు. తన ఫేవరెట్ హీరో పాటకి డ్యాన్స్ చేస్తూ కదులుతున్న లారీ మీది నుంచి కింద పడి గాయాలపాలై చనిపోయాడు. ఇక పొలిటికల్ ర్యాలీలు, సభలతో పాటు ఫేవరెట్ హీరోల బర్త్‌డేలకి, సినిమా రిలీజ్‌ల టైంలో జరిగే ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
పిచ్చిగా బిహేవ్ చేస్తున్న ఫ్యాన్స్
మిగిలిన ఇన్సిండెంట్స్ వదిలేస్తే.. థియేటర్లలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటిలో మనకి కామన్‌గా కనిపించే ఇష్యూ క్రౌడ్ అండ్ స్టాంపీడ్. అంటే ఎక్కువ జనాలు ఉండటం.. అండ్ తోపులాట జరగడం. ఎవరో ఒకరు చనిపోవడం. ఇదే అసలు ప్రాబ్లం. ఇక్కడ ఫ్యాన్స్ ఇంత పిచ్చిగా బిహేవ్ చేయడం అన్నింటికంటే పెద్ద తప్పైతే.. వాళ్లని కంట్రోల్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లని థియేటర్స్ చేసుకోకపోవడం మేనేజ్‌మెంట్స్ మిస్టేక్.
ఆ పాపం సంధ్య థియేటర్ యజమాన్యానిదేనా..?
ఇప్పుడు పుష్ప2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ రావడం చూసినా.. మనకి దొరికిన ప్రూఫ్స్ ప్రకారం.. దానికి కూడా థియేటర్ మేనేజ్‌మెంటే కారణంగా కనిపిస్తోంది. అదెలాగంటే.. అల్లు అర్జున్ అరెస్టైన తర్వాత థియేటర్ మేనేజ్‌మెంట్ పోలీసులకు రాసిన పర్మిషన్ లెటర్‌ని బయటపెట్టింది. కానీ దానిని పోలీసులు రిజెక్ట్ చేసినా.. దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకుని ఉంటే అల్లు అర్జున్‌కి కచ్చితంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఉండేవాళ్లు కదా..? సాధారణంగానే మాస్ థియేటర్.. అయినా అక్కడ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడానికి థియేటర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు. పోలీసులే ఇనీషియేట్ తీసుకుని క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారంతే. ఇది థియేటర్ మేనేజ్‌మెంట్ ఫస్ట్ మిస్టేక్. ఇక అల్లు అర్జున్‌కి విషయం చెప్పకుండా సైలెంట్‌గా అతడిని థియేటర్‌ని రానివ్వడం థియేటర్ చేసిన రెండో మిస్టేక్. దీన్ని బట్టి చూస్తే థియేటర్లో అంత తొక్కిసలాట జరగడానికి కానీ, రేవతి ప్రాణాలు పోవడానికి కానీ, చివరికి అల్లు అర్జున్ ఇలాంటి ఇష్యూలో ఇరుక్కోవడానికి కానీ కారణం.. థియేటర్ యాజమాన్యం నెగ్లిజెంట్‌గా బిహేవ్ చేయడమే.. అనేది కొంతమంది ఒపీనియన్.
ఆ ప్రశ్నలకు సమాధానం ఏది..?
అయితే ఇక్కడ అర్థం కానిదేంటంటే.. ఇన్సిడెంట్ జరిగిన తెల్లవారి నుంచే పోలీసులు మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెబుతున్నా.. అల్లు అర్జున్ అరెస్టై.. కోర్టులో ప్రవేశపెట్టే వరకు థియేటర్ యాజమాన్యం పోలీసులని ముందే పర్మిషన్ అడుతూ రాసిన లెటర్‌ని ఎందుకు రిలీజ్ చేయలేదు..? ఇక పోలీసులు కూడా అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చేసి బయటకొచ్చిన మర్నాడు వరకు థియేటర్ అడిగిన పర్మిషన్‌ని రిజెక్ట్ చేస్తూ ఇచ్చిన లెటర్‌ని ఎందుకు బయటపెట్టలేదు..? ఇవి ఆన్సర్ దొరకని మిస్టీరియస్ క్వశ్చన్స్.
బన్నీ యాటిట్యూడే కొంప ముంచుతుందా..?
ఇక అల్లు అర్జున్ చుట్టూ ఇలాంటి ఉచ్చు బిగుసుకోవడానికి ప్రధాన కారణం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నట్లు చూసి చూడనట్లు వదిలేసే గవర్నమెంట్స్ కాకపోవడం. తప్పు ఎవరు చేసినా తప్పే.. అనే ఆలోచనతోనే ఈ ఇన్సిడెంట్‌ని రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అందుకే అల్లు అర్జున్ ఇరుక్కున్నాడు. ఇక దీనికి తోడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మీద ఇంతలా నెగెటివిటీ రావడానికి కారణం బన్నీ యాటిట్యూడే. పుష్ప 2 మేనియాలో ఎక్కడో బన్నీ... రియాలిటీ అండ్ సినిమాకి మధ్యలో ఉండే తేడా మర్చిపోయాడేమో అనిపిస్తుంది. పుష్ప 2 ప్రమోషన్స్‌లో కానీ.. సంధ్య థియేటర్‌కి ర్యాలీగా రావడంలో కానీ.. ఆ తర్వాత జరిగిన ఘటనపై రియాక్ట్ అవడంలో కానీ.. చివరికి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కానీ.. ఫైనల్‌గా మొన్నటి ప్రెస్‌మీట్‌లో కానీ.. అతడి మాట తీరు.. బాడీ లాంగ్వేజ్.. అండ్ బిహేవియర్.. అన్నీ యాటిట్యూడ్ స్టార్‌ని మించిపోయేలా ఉన్నాయి. ఇక్కడే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే అతడికి అగైనెస్ట్ అయ్యారనే మాట కూడా వినిపిస్తోంది. దానికి తోడు.. మొన్న పెట్టిన ప్రెస్‌మీట్‌లో కూడా తన క్యారెక్టర్‌ని దెబ్బ తీస్తున్నారు.. తనని ఇబ్బంది పెడుతున్నారు.. నాకు కష్టంగా ఉంది.. నేను బాధపడుతున్నాను.. అని చెప్పడం తప్పితే.. ఎక్కడా అతడి ఫేస్‌లో పశ్చాత్తాపం అనేది కనపడలేదనేది చాలా మంది ఒపీనియన్.
ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతోనే..
ఇక అల్లు అర్జున్ చుట్టూ ఇలాంటి ఉచ్చు బిగుసుకోవడానికి ప్రధాన కారణం ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నట్లు చూసి చూడనట్లు వదిలేసే గవర్నమెంట్స్ కాకపోవడం. తప్పు ఎవరు చేసినా తప్పే.. అనే ఆలోచనతోనే ఈ ఇన్సిడెంట్‌ని రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది.అయితే ఈ ఇన్సిడెంట్‌లో అల్లు అర్జున్‌ది తప్పు అని ఇంత పెద్దగా అరుస్తూ చెప్పేవాళ్లు.. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఇన్సిడెంట్స్‌ని అంత సీరియస్‌గా ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్‌లో అల్లు అర్జున్‌కి శిక్ష పడితే మిగిలిన హీరోలకి కూడా శిక్ష పడాలి కదా? అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే.. మిగిలిన ఇన్సిడెంట్స్‌లో హీరోలు దాదాపు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ కాకపోవడం.. ఒకవేళ ఇన్వాల్వ్ అయినా.. అన్ని పర్మిషన్స్‌తో రావడం వల్ల అక్కడ హీరోల తప్పు లేకుండా పోయింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా రావడమే అతడిని ఈ కేసులో ఇరుక్కునేలా చేసింది.
థియేటర్ యాజమాన్యాలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే..
అయితే అల్లు అర్జున్ తప్పు చేశాడా..? శిక్ష పడుతుందా..? కేస్‌లో ఏ11గా ఉన్నాడు కాబట్టి బయటపడతాడా..? అనేది చట్టం, పోలీసులు చూసుకుంటారు. బట్.. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరక్కుండా చూసుకోవాల్సిన థియేటర్ అడ్మినిస్ట్రేషన్స్ మాత్రం చాలా బాధ్యతారాహిత్యంగా బిహేవ్ చేస్తున్నాయి అని మాత్రం రీసెంట్ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. కాబట్టి.. పోలీసులు కానీ.. ప్రభుత్వం కానీ.. ముందు ఇలాంటి థియేటర్లు, థియేటర్ యాజమాన్యాలపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటేనే ఇలాంటి సంఘటనలు మరికొన్ని జరక్కుండా ఉంటాయనేది మా ఒపీనియన్. ఇక ఫైనల్‌గా ఫ్యాన్స్‌కి ఒక్కటే మెసేజ్. హీరోలని, సెలబ్రిటీలని ఇష్టపడడం తప్పు కాదు.. కానీ అది పిచ్చిగా, ఉన్మాదంగా మార్చుకుంటే అది మిమ్మల్నే నాశనం చేస్తుంది.
మరి మీరేం అంటారు..? అల్లు అర్జున్ ఇష్యూలో థియేటర్ యాజమాన్యానిదే తప్పంటారా..? లేక అల్లు అర్జున్‌దే తప్పంటారా..? కామెంట్ చేసి చెప్పండి.