ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి : కేసీఆర్

by Shyam |   ( Updated:2020-11-28 07:02:46.0  )
ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి : కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తున్న క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అంతేకాకుండా, నేతల పనితీరుపై చర్చ జరగాలని, అప్పుడే మంచి రాజకీయ నేతలు ప్రజల్లో ఉంటారన్నారు.

ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లు చూశామని, తెలంగాణ వారికి రాష్ట్రాన్ని నడపడం రాదని, ఫలితంగా హైదరాబాద్ ఖాళీ అవుతుందని అప్పటి నాయకులు శాపాలు పెట్టినట్లు గుర్తుచేశారు. గులాబీ పార్టీ పాలనలో ఏడేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, ఆరేళ్లలో విద్యుత్ కోతలను జయించామని, నీటి పంచాయితీలు కూడా తప్పాయన్నారు. టీఆర్ఎస్ తీసుకున్ని నిర్ణయాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు.

ఐదేళ్లలో మిషన్ భగీరథను పూర్తి చేస్తామని, భవిష్యత్తులో 24 గంటల పాటు ఉచిత మంచినీరు అందిస్తామని సీఎం కేసీఆర్ బహిరంగ సభలో స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ పాలనలో జాతి, కులం, మతం, ప్రాంతం అనే తేడాలు లేకుండా సంక్షేమ పథకాలను అందరికీ వర్తింపజేశామని ప్రజలకు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed