- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. మేడ్చల్ పంచాయితీకి చెక్
దిశ ప్రతినిధి, మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద మేడ్చల్ పంచాయితీ తెగింది. టీఆర్ఎస్ నూతన కమిటీల ఎంపిక విషయమై మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, జడ్పీఛైర్మన్ అయిన తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఇటీవలే శరత్ చంద్రా రెడ్డి రాజీనామాకు సిద్ధ పడిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రితో పాటు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డిని సీఎం తన వద్దకు పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది.
దీంతో జడ్పీఛైర్మన్ మంత్రి తనను లెక్క చేయడం లేదని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, తన సొంత మండలంలో సమచారం లేకుండా కమిటీ వేశారని, దీంతో మనస్థాపానికి గురై రాజీనామా చేయాలనుకున్నట్టు జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డి సీఎంకు వివరించినట్లు తెలిసింది. దీంతో మంత్రి మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం. జిల్లాలో అందరినీ కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటు పడాలని, గ్రూపు రాజకీయాలకు తావులేదని సీఎం మందలించినట్లు తెలిసింది. జడ్పీ ఛైర్మన్‌తో పాటు ముఖ్య నాయకులను కలుపుకుని పోయి పార్టీ పటిష్టతకు పాటు పడాలని సీఎం మంత్రి మల్లారెడ్డిని అదేశించినట్లు తెలిసింది. ఇంతకాలం మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న ఉత్కంఠకు సీఎం చొరవతో తెరపడినట్లైంది.