- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మొరిగే కుక్కల నోళ్లు మూయించండి : సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘ముందస్తు ఎన్నికలకు పోవడం లేదు. ఆ అవసరం మనకు లేదు. ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం ఉంది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ నిర్వహించారు. సంస్థాగత ఎన్నికలు, ప్లీనరీ, వరంగల్ సభ, అధ్యక్షుడి ఎన్నికపై సుమారు 3 గంటల పార్టీ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వచ్చే నెలా 15న వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహించాలని, మనపై మొరిగే కుక్కల నోర్లు మూయించాలని సూచించారు. 10లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామం నుంచి బస్సుల్లో తరలించాలన్నారు. రెండేళ్లలో అన్ని పనులు చేసుకుందామని, మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు.
హుజూరాబాద్‌లో మనమే గెలుస్తాం
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందని, ఎలాంటి అనుమానం, అపోహలు అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని సర్వేల్లో బీజేపీ కంటే 13శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు. మిగతా పార్టీలు మన దారిదాపుల్లో లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే ప్రజలంతా మనవైపు ఉన్నారన్నారు. వారి అండతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26 లేదా 27వ తేదీల్లో హుజూరాబాద్‌కు ప్రచారానికి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.
6 వేల మందితో ప్లీనరీ
ప్లీనరీని 14వేల మందితో నిర్వహించాలని అనుకున్నప్పటికీ కేవలం 6 వేల మందితో మాత్రమే నిర్వహించడం జరుగుతుందని కేసీఆర్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్యులు 50 మంది వచ్చేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కువ అవసరం లేదని, ప్రముఖులు మాత్రమే వచ్చేలా చూడాలన్నారు. వచ్చే ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. ఐడీకార్డు ఉంటేనే ప్లీనరీకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయి కమిటీలు పూర్తయ్యాయని, పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలి
ఎంపీ స్థానాలపై దృష్టిసారించాలి. కేంద్రంలో ఏకపక్షంగా సీట్లు రావు. పోయిన సారి బీజేపీకి వచ్చాయి. ఈసారి రావు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయి. గతంలో కంటే రాబోయే ఎన్నికల్లో ఎంపీ స్థానాలన్నింటిని కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి అని పిలుపు నిచ్చారు. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను వేసుకుంటుంన్నందున ఆ కమిటీలకు ఎప్పటికప్పుటు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలని, రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు.
సమావేశంలో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, మహమూద్ అలీ, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీలు రాములు, రంజిత్ రెడ్డి, కేశవరావు, బండ ప్రకాశ్, నామ నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మికాంతారావు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, దానం నాగేందర్, మెతుకు ఆనంద్, రేఖా నాయక్, మాగంటి గోపినాథ్, గాదరి కిశోర్, నోముల భగత్, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, ప్రకాశ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.