- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో బ్రహ్మండంగా గెలుస్తాం : సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లా కొండగండ్ల మండల కేంద్రంలో శనివారం రైతు వేదికలను సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దుబ్బాక ఉప ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మండంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారాల్లో భాగంగా బీజేపీ నాయకులు అసత్యాలు చెబుతున్నారని వెల్లడించారు. రూ.2016 చొప్పున 38 లక్షల మందికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని, కానీ కేంద్రం 7 లక్షల మందికే పెన్షన్ ఇస్తూ.. కిందిది, మీదికి మీదిది కిందికి చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో కేంద్రం ఇచ్చేది కూడా మనిషికి రూ.200 అని స్పష్టం చేశారు. ఏటా పెన్షన్ల కోసం రాష్ట్రం రూ.11 వేల కోట్లను భరిస్తోందని వెల్లడించారు. అందులో కేంద్రం రూ.105 కోట్లే ఇస్తుందని తెలియజేశారు.
కానీ పెన్షన్ మొత్తం కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో బీజేపీ నేతలు ఇంత దిగజారి ప్రచారం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఈ పెన్షన్ లెక్కల్లో తాను చెప్పేది అబద్ధం అని బీజేపీ నేతలు నిరూపిస్తే.. ఇప్పుడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టంతో రైతుల పొట్టగొట్టేందుకు చూస్తోందని గుర్తు చేశారు. ఆ చట్టంతో కార్పొరేట్ శక్తులకు న్యాయం చేసే విధంగా రూపొందించారని వెల్లడించారు. దీనిపై కేంద్రంపై పిడికి బిగించి, యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నూతన వ్యవసాయ చట్టం ద్వారా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి రైతుకు ఉంటుందా అని.. ఢిల్లీలోని రైతు తెలంగాణకు, తెలంగాణ రైతు ఢిల్లీకి వెళ్లి అమ్ముకునే పరిస్థితి ఉండదని అన్నారు. ఈ నూతన చట్టంతో భారత వ్యవసాయం ప్రమాదంలో పడబోతోందని సూచించారు. రైతులు ఐకమత్యంగా ఉంటే ఇలాంటి బిల్లులను అడ్డుకోగలం అన్నారు.