- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టులు పెంచండి .. మాస్కు లేకపోతే రూ.1000 వసూల్ : సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సంబంధిత మంత్రులు, అధికారులతో కరోనా వ్యాప్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి వైద్యరోగ్యాశాఖ మంత్రి ఈటల రాజేందర్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యా్ప్తిని అరికట్టేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలన్నారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లకు వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అది కూడా యుద్ధప్రాతిపదికన వారంలో పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అందుకోసం అవసరమైన ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లను తెప్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేశారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలన్నారు. 45ఏళ్లు పైబడిన వారు తప్పకుండా వ్యా్క్సిన్ తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.