వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఎంజీఎంకు

by vinod kumar |   ( Updated:2021-05-21 01:45:22.0  )
వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఎంజీఎంకు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరంగల్‌కు చేరుకున్నారు. కాసేపట్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, వైద్యాధికారులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల బాగోగులను తెలుసుకోనున్నారు. కరోనా పేషెంట్లకు అందుతున్న చికిత్సపై స్వయంగా ఆరా తీయనున్నారు.

Advertisement

Next Story