- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటల ఎఫెక్ట్.. కేసీఆర్ సంచలన నిర్ణయాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎర్రవల్లి ఫాంహౌస్‌కు సమయమిచ్చిన సీఎం.. ఇప్పుడు ప్రగతిభవన్‌కు పరిమితమవుతున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైనప్పుడు కేసీఆర్ ఎక్కువగా ఫాంహౌస్‌కే వెళ్లేవారు. కానీ, ఇప్పుడు మాత్రం అధికారిక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంతో మారుతున్న సమీకరణాలపై దృష్టి పెట్టారు. ఇటీవలే జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లో వారికి కియా కార్నివాల్కార్లను అందించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రగతిభవన్ దగ్గరే తచ్చాడుతున్నారు. ఇటీవల వరుసగా గ్రామాల బాట పట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రగతిభవన్‌కు పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
సారీ.. అనుమతి లేదు
గతంలో ప్రగతిభవన్‌లో కేవలం కొంతమందికే ప్రవేశం ఉండేది. సీఎం వచ్చారంటూ నలుగురైదుగురు సీనియర్అధికారులు, ఇద్దరు, ముగ్గురు ప్రభుత్వ సలహాదారులు, ఓ ఎంపీ, అవసరమైనప్పుడు మంత్రులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇక రెండు, మూడుసార్లు హైదరాబాద్‌లో మిత్రులు మజ్లీస్ పార్టీకి ఆహ్వానం పలికారు. ఆ తర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లాలంటే అదో పెద్ద టాస్క్. ఏకంగా మంత్రులు కూడా ప్రగతిభవన్ గేట్ల దాకా వెళ్లి.. సీఎం అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో తిరిగి వచ్చారు. మంత్రులను కూడా ప్రగతిభవన్ప్రధాన గేటు వరకు వెళ్లనీయలేదు.
రండి.. రండి
ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం అధికారిక నివాసానికి కొంతమందికి దారులు తెరిచాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంతో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందని నిఘా వర్గాలు నివేదించాయి. దీంతో, సీఎం రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. అటు రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక కూడా త్వరలోనే రానుంది. దీంతో అక్కడ గెలుపు కోసం వ్యూహాలు మొదలయ్యాయి. ఇక ప్రగతిభవన్‌లో సందడి మొదలైంది. ఇప్పటి వరకు అపాయింట్‌మెంట్ రాని వారిని కూడా ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారు. ఏడేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు.. సీఎం అధికారిక నివాసం గేట్లు దాటి లోపలకు వెళ్లారు.
అంతకు ముందు అదనపు కలెక్టర్లు.. శనివారం కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రేపు దళిత ఎమ్మెల్యేలతో మధ్యాహ్న భోజనం, సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ వ్యవహారంతోనే ఈ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పుడు ఎవరైనా సీఎం అపాయింట్మెంట్అడిగితే వెంటనే దొరుకుతుందంటున్నారు.