- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాసు పుస్తకంపై సీఎం కేసీఆర్ ఫొటో
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో కొత్త విధానాన్ని అమల్లోకి వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకం/భూమి యాజమాన్యపు హక్కు పత్రాన్ని సీఎం కేసీఆర్ఫొటోతో ఇస్తున్నారు. శనివారం నుంచి ధరణిలో హక్కు పత్రాలను డౌన్లోడ్చేసుకుంటే ఫోటో కనిపించింది. అలాగే ఎవరైనా భూమిని కొన్న వెంటనే మ్యుటేషన్ చేస్తారు. ఆ వెంటనే డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాన్ని చేతికి అందిస్తారు. వాటిపైనా సీఎం కేసీఆర్ ఫోటో కూడా వస్తోంది. రాష్ట్రంలో ఆర్వోఆర్చట్టాన్ని సరికొత్తగా తీసుకొచ్చానన్న పేరు, ఖ్యాతిని గడించేందుకు తన ఫొటోతో సహా అందించే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. మూడేండ్లు అధ్యయనం చేసి తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020ను అమల్లోకి తీసుకొచ్చామని పలుమార్లు ప్రకటించారు. పైగా దేశంలో మరెక్కడా ఇలాంటి సౌలభ్యవంతమైన విధానం లేదన్నారు. ధరణి పోర్టల్‌తో భూమి హక్కులు పక్కగా మారాయని ప్రచారం చేశారు. రెవెన్యూ వ్యవస్థలోనే సమూల మార్పులకు శ్రీకారం చుట్టారన్న పేరు గడించారు. ఈ నేపథ్యంలోనే పీపీబీలపైనా తన ఫోటో కూడా ప్రచురిస్తుండడం గమనార్హం. ఐతే సీఎం కేసీఆర్ఆదేశాల మేరకు ఈ ప్రకియ మొదలైందా? ఉన్నతాధికారుల స్వీయ నిర్ణయమా? అన్న విషయం తేలాల్సి ఉంది.