కేసీఆర్ సంచలన ఆదేశాలు.. నాకు అక్కడ గెస్ట్ హౌస్ కట్టండి

by Anukaran |   ( Updated:2021-07-27 06:12:10.0  )
cm-kcr government
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు పూర్తి చేసేందుకు ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చుంటా.. ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఇక్కడ ఓ గెస్ట్ హౌస్ కట్టించు అని.. ఐదున్నర సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్ అన్న మాటలకు కార్యరూపం దాల్చబోతోంది. 2 నెలల క్రితం హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఇప్పుడు నా దృష్టి అంతా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడమే అక్కడ ఒక గెస్ట్ హౌస్‌ను నిర్మించండి.

ఆ గెస్ట్ హౌస్‌లోనే ఉంటూ పరిపాలన కార్యక్రమాలు.. ఇటు ప్రాజెక్టు నిర్మాణ పనులు చూస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ వ్యక్తిగత వాస్తు శాస్త్ర నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మాణంలో ఉన్న కురుమూర్తిరాయ ప్రాజెక్టు దగ్గర గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే, సుధాకర్ తేజ పలు స్థలాలను పరిశీలించారు.

ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన వెంటనే నిర్మాణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ దయానంద్, డీఈఈ ప్రభాకర్ రెడ్డి, జేఈ శివ కుమార్, భూత్పూర్ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వ రాజ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

KCR-Guest-house

Guest-house

Read More: వివాదాస్పదంగా మారిన టీఆర్ఎస్ నాయకుల తీరు.. చంపుతామంటూ బెదిరింపులు

Advertisement

Next Story

Most Viewed