- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సర్కార్ భూములపై సీఎం మాస్టర్ ప్లాన్.. టీఆర్ఎస్ నేతలకు పండగే..!
దిశ, తెలంగాణ బ్యూరో : నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్న సర్కారు.. ధరలను రెండింతలు పెంచేందుకు సిద్ధమైంది. మార్కెట్విలువను పెంచిన తర్వాతే సర్కారు భూములను అమ్మకానికి పెట్టనుంది. ప్రస్తుతం భూములను గుర్తించినా… వాటికి ఎంత మేరకు ధర అనేది ఇంకా నిర్ణయించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్పరిధిలోని హౌసింగ్‌బోర్డు భూములతోనే దాదాపు రూ.16 వేల కోట్లు వస్తాయని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం… భూములు మార్కెట్‌వాల్యూ పెంచి మరో రూ.20 వేల కోట్లను అదనంగా రాబట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు రూఢీ అవుతోంది.
హౌసింగ్ బోర్డు భూములతో పాటుగా కోకాపేట ల్యాండ్స్, హైదరాబాద్ చుట్టు పక్కల భూములు, రాజీవ్ స్వగృహ ప్లాట్లను అమ్మేందుకు సర్కారు అన్నీ సిద్ధం చేసింది. ఇక కొన్నిచోట్ల గంపగుత్తగా కాకుండా ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టాలనుకున్న సర్కారు… మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తమ అనుచరుల కోసం గంపగుత్తగా విక్రయించేందుకు సిద్ధమైంది. వాస్తవంగా కొన్ని చోట్ల సర్కారు భూములున్న చోట్ల ఇప్పటికే గులాబీ నేతలు, కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు వాటి పక్కనే ఎంతో కొంత భూములను కొన్నారు. ఇప్పుడు సర్కారు భూములను విక్రయించడం మొదలుపెట్టగానే వాటిని కొనుగోలు చేసి, ధరలను విపరీతంగా పెంచనున్నారు. దీనికి ఓ కీలక మంత్రి కోటరీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పెంచి అమ్మడమే!
వాస్తవంగా భూముల ధరలను పెంచుతారని రెండేండ్ల నుంచి ప్రభుత్వం హడావుడి చేస్తుంది. కానీ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే నాలుగైదుసార్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డిపార్ట్‌మెంట్‌నుంచి నివేదికలు, అంచనాలు తీసుకున్నారు. కానీ అన్నింటినీ పెండింగ్పెట్టింది. అయితే ప్రస్తుతం మళ్లీ పెరిగిన ధరల ప్రకారం మార్కెట్ వాల్యూను అనుసరించి కొత్త ధరలతో ఆ శాఖ నివేదిక కూడా అందించింది. ప్రభుత్వ భూముల అమ్మకానికి అంతా సిద్ధం చేసుకున్న ప్రభుత్వం.. ఈ ధరల సవరణ అనంతరమే విక్రయాకు దిగుతోంది.
భూములు, ఆస్తులు అమ్మకానికే ధరల సవరణ
హెచ్ఎండీఏ పరిధిలోని రెవెన్యూ, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను, ఆస్తులను అమ్మేసి రూ.35 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి ముందుగా రూ.16 వేల కోట్లు వస్తాయని అధికారులు అంచనాలిచ్చినా… ఇంత తక్కువ ధరకు ఇంత విలువైన భూములను అమ్మేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదంటున్నారు. అందుకే మార్కెట్ధరలను సవరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. వాస్తవానికి ఏడేండ్ల నుంచీ ప్రభుత్వ భూములపై కన్నేసిన ప్రభుత్వం వాటిని అమ్మేందుకు ఏదో ఓ సందర్భంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఏదో ఒక కారణంతో బ్రేకులు పడుతున్నాయి.
తాజాగా కరోనా ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వానికి కలిసి వచ్చాయి. ఆదాయం లేదంటూ భూములను అమ్మేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. గతంలో హైదరాబాద్ శివారు కోకాపేటలోని 100 ఎకరాల విలువైన హెచ్ఎండీఏ భూములను అమ్మాలకున్నా లీగల్ వివాదాలు తలెత్తడంతో సాధ్యం కాలేదు. ప్రస్తుతం ఆ వివాదాలు తొలిగిపోవడంతో వంద ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం జాబితా సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హెచ్ఎండీఏ ఆధీనంలోని మరో 150 ఎకరాలను కూడా గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో 871 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 638 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటినీ అమ్మేయాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ కల్ప కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఓపెన్ మార్కెట్ లో అమ్మితే దాదాపు రూ. వెయ్యి కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. కానీ ధరలను పెంచి అమ్మితే మరో రూ. 800 కోట్లు అదనంగా వచ్చే అవకాశం కూడా ఉంది.
హౌసింగ్ బోర్డు భూములతో రూ. 35 వేల కోట్లు
హౌసింగ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాలు భూములు ఉన్నాయి. ఈ భూములకు గతంలో పెద్దగా డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు మాత్రం చాలా డిమాండ్ పెరిగింది. దీంతో ఆ భూములను అమ్మకానికి పెట్టుతున్నారు. ఇప్పటికే హౌసింగ్ శాఖ ఆయా భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిమాండ్ ఉన్నాయి, ఇప్పుడు అమ్మితే ఎంత ఆదాయం వస్తుంది, రేట్లు పెంచితే ఎంత మేరకు పెరుగుతుందని లెక్కలన్నీ ప్రభుత్వానికి సమర్పించారు.
రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో దాదాపు 871 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని అమ్మితే ఇప్పుడు సుమారు రూ. 35 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోనే 638 ఎకరాల భూములు ఉండగా.. వీటిని అమ్మితేనే తక్కువలో తక్కువ రూ. రూ. 25 నుంచి రూ. 30 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని తాజా అంచనాలు వేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని భూములను అమ్మితే రూ. 5 వేల కోట్లు వస్తుందని లెక్కలేస్తున్నారు.
పెంచేతేనే పుష్కల ఆదాయం
ల్యాండ్ వ్యాల్యూ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయింది. భూముల విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో స్టాంప్ డ్యూటీ చార్జీలను పెంచితే మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 100 శాతం అదనపు ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పేర్కొంది. 2020-–21లో రూ. 6,101 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసిన సర్కారు, 2021–22 బడ్జెట్ లో మాత్రం ఏకంగా రూ. 12,685 కోట్ల ఆదాయాన్ని చూపించింది. అంటే ప్రస్తుతం అమలవుతున్న భూముల ధరలు ఏకంగా వంద శాతం పెంచే అవకాశం ఉందని అప్పుడే తేల్చింది. రాష్ట్రం వచ్చినప్పట్నుంచి ల్యాండ్ వ్యాల్యూను పెంచలేదని, ఈసారి పెంచక తప్పదని అధికారులు కూడా చెప్పుతున్నారు. దీనిపై సదరు శాఖ నుంచి పూర్తిస్థాయి నివేదికను సైతం ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు లెక్కల ప్రకారం ధరలను డబుల్ చేయనున్నారు.
మనోళ్లకైతే గంపగుత్తగా…!
హైదరాబాద్ సిటీకి ఆనుకుని భూములను గంపగుత్తగా కాకుండా ప్లాట్లుగా చేసి విక్రయించాలని ఆయా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఉదాహరణగా కోకాపేటలోని భూములకు మంచి డిమాండ్ ఉండగా… వాటిని ప్లాట్లుగా మార్చాలని ఇప్పటికే సూచించారు. కోకాపేటలో దాదాపు 150 ఎకరాలలో లే అవుట్రెడీ చేశారు. ఐటీ కారిడార్ దగ్గరగా ఉండటంతో వీటికి చాలా డిమాండ్ఉంటోంది. ఇలా కొన్నిచోట్ల ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేయాలని భావిస్తున్నారు. అయితే కొంతమంది టీఆర్ఎస్నేతలకు అవసరం ఉంటే మాత్రం అక్కడ గంపగుత్తగా విక్రయాలు చేసే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్నేతలకు ఉన్న భూములను ఆనుకుని ప్రభుత్వ భూములున్నాయి. అలాంటి ప్రాంతాల్లో మాత్రం వాళ్లే ఇప్పటికే కర్ఛీఫ్వేసి సిద్ధంగా ఉన్నారు.
ఇదీ అంచనా (పెరిగిన ధరలతో)..
* హౌసింగ్ బోర్డుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 871 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని అమ్మేస్తే సుమారు రూ.35 వేల కోట్లు వస్తాయని అంచనా.
* హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 150 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని ప్లాట్లుగా మార్చి అమ్మితే రూ. 10 వేల కోట్ల దాకా వస్తాయని అంచనా.
* హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉప్పల్, ఘట్కేసర్, హయత్ నగర్ సమీపంలో భూములున్నాయి. వీటిని అమ్మేస్తే రూ. 5 వేల కోట్లు వస్తాయని అంచనా.
* రాజీవ్ స్వగృహ కల్ప కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ఫ్లాట్లు ఉన్నాయి. విడిగా ఒక్కో ఫ్లాట్‌ను కాకుండా గంపగుత్తగా అమ్మితే రూ. 2 వేల కోట్లు వస్తాయని అంచనా.