తెలంగాణ వాళ్లకు ఏమీ చేతకాదు అన్నారు.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Sridhar Babu |
CM Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ భవనం కట్టడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టరేట్ భవనాలను డిజైన్ చేసింది తెలంగాణ బిడ్డే అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణం ఆగదని తెలిపారు.

వలస పోయినోళ్లు మళ్లీ ఊర్లకు తిరిగి వస్తున్నారని అన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. వర్షాలు బాగా పడినా రిపేర్ చేసిన చెరువులు తెగలేదు. 92 లక్షల టన్నుల ధాన్యాన్ని FCIకు అందించామని అన్నారు. కరీంనగర్ సజీవ జలధారగా తయారైందని పేర్కొన్నారు. SRSP వరద కాలువ రిజర్వాయర్‌గా మారింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ వారికి ఏమీ చేతకాదనే అనే వారు.. ఇప్పుడు తెలంగాణను చూసి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనాన్ని ప్రసారం చేశారని తెలిపారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తామంటే ఎగతాళి చేశారని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story