- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ కీలక ప్రకటన.. నల్లగొండ వాసులకు గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్ : సీఎం సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో జిల్లాలోని హాలియాలో సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై సమీక్షించేందుకే ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు.
అయితే, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కారణంగా ఇక్కడకు రావడం కొంత ఆలస్యమైందని అన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పట్టణాభివృద్ధికి చాలా పనులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక్కడ మౌళిక సదుపాయాల సమస్యలను పరిష్కారించాల్సి ఉందని అన్నారు. నందికొండ మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ కలెక్టర్‌ను ఆదేశించారు.
అంతేకాకుండా.. నందికొండ, హాలియా మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే నోమలు భగత్ కోరిన కారణంగా హాలియాకు 15 కోట్లు, నందికొండ మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేవు. కరోనా వచ్చిన తర్వాత ఆసుపత్రులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉన్న ఆరోగ్య కేంద్రాలను, ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం మొత్తం 150 కోట్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన నిధులను కూడా మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 33 జిల్లాలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.