- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డికి సీఎం కేసీఆర్.. పర్యటన విశేషాలు ఇవే!
దిశప్రతినిధి, నిజామాబాద్ : సీఎం కేసిఆర్ ఈ నెల 20న కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించ నున్నారు. నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్, జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభానికి హాజరుకానున్నట్లు అధికారులకు సమాచారం అందింది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పర్యటనలో భాగంగా ఒక్క కామారెడ్డిలో మాత్రమే సీఎం పర్యటిస్తారని, నిజామాబాద్‌కు సంబంధించిన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని సమాచారం. అది కూడా సిద్ధిపేట జిల్లాలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించి కామారెడ్డి వస్తాడని అధికారులు తెలిపారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఈ నెల 10 నుంచి 15 మధ్య పర్యటిస్తారని జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసిఆర్ ఇటీవల మెట్‌పల్లిలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి సురేష్ మరణించడంతో పరామర్శకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆర్మూర్‌లో అరగంట సేదతీరిన ముఖ్యమంత్రి తర్వాత రెపో మాపో జిల్లాకు వస్తారని అధికార యంత్రాంగాలు అలర్ట్ అయ్యాయి. అయితే, అమావాస్య రావడంతో జిల్లా పర్యటన వాయిదా పడిందని అందరూ భావించారు.
ఈ నెల 20న కామారెడ్డి జిల్లా పర్యటన ఉండటంతో నిజామాబాద్ పర్యటన షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందో అని సీఎంవో అధికారులు ఖరారు చేస్తే గానీ తెలిసే పరిస్థితి లేదు. ఒక్క నెలలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మూడు సార్లు పర్యటిస్తారా..? అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే నిజామాబాద్ కొత్త కలెక్టరేట్‌తో పాటు జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది.