సీఎం కేసీఆర్ మరో రెండు రోజులు ఢిల్లీలోనే..!

by Shyam |
telangana smart cities warangal karimnagar
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. తొలుత షెడ్యూలు ప్రకారం బుధవారం సాయంత్రానికే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నది. అయితే పలువురు కేంద్ర మంత్రుల్ని కలవడం కోసం మరో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పౌరసరఫరాల అంశానికి సంబంధించి ఆ శాఖకు చెందిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. గురువారం మొత్తం అక్కడే ఉండి శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు రిటన్ కావచ్చని సమాచారం.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది రోజుల పాటు కంటిన్యూగా ఢిల్లీలోనే ఉండడం అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. విపక్ష పార్టీల రాజకీయ ప్రకటనలు, విమర్శలు ఎలా ఉన్నా ఇన్ని ఎక్కువ రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోవడం చాలా అరుదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయడానికి ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మరుసటి రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తిగా ప్రైవేటు పర్యటన కాబట్టి ఈ నెల 3వ తేదీ సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కానీ ఆ తర్వాత ప్రధాని, కేంద్ర హోం మంత్రి, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా మరో ఇద్దరితో సమావేశం కావడం కోసం ఢిల్లీలోనే ఉండాలనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed