- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ హాలియా పర్యటనకు ముహూర్తం ఫిక్స్..
దిశ, హాలియా : నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రగతి సమీక్ష చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2న హాలియా మున్సిపాలిటీకి రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 26 సార్లు పైగా విచ్చేసి జిల్లా అభివృద్ధి గురించి సమీక్షించినట్లు వివరించారు. సమైక్యాంధ్ర పాలనలో అతి దారుణంగా, పూర్తిగా దెబ్బతిన్న జిల్లా అని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిందని, కృష్ణా గోదావరి నదుల నీళ్లు తెచ్చుకుని సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉన్నా నల్లగొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
కృష్ణా నది పక్కన ఉన్న సాగునీరు కాదు కదా.. తాగునీరు లేక 1000కి పైగా గ్రామాలు ఫ్లోరిన్ బారిన పడ్డాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టారని, అందుకోసమే జిల్లాకు వస్తున్నారని మంత్రి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హాలియాకు విచ్చేసి అధికారుల సమక్షంలో నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తారన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని సూచించారు.