- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూపాల్ పల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
దిశ, భూపాలపల్లి: భూపాలపల్లి ప్రజలకు వైద్య వృత్తిని అందించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల ప్రజల కోసం జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరిన వెంటనే స్పందించి మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండింటిని ఒకే పద్ధతిలో ముందుకు తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు. 75 మందికి కళ్యాణ లక్ష్మీ, 11 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న యాత్ర అర్థ రహితమైన, అనాలోచితమైన యాత్ర అని తెలిపారు. ‘విభజన చట్టంలో పెట్టిన ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమంటే మీనమేషాలు లేక్కిస్తున్నారు. ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎలాంటి హామీలు లేకుండా వేగవంతంగా కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయి. దానికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు. ‘నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డ్ తెస్తామన్నారు. కానీ ఇంతవరకు తేలేదు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ విభజన చట్టంలో ఉంటే యూనివర్సిటీ నిధులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే నిర్లక్ష్యం, సమాధానం ఇవ్వడం లేదు. ఇలా ఏ అంశంలో కూడా ఒక పారదర్శకత లేదు’ అని అన్నారు. నిజంగా బీజేపీ నేతలకు చిత్త శుద్ది ఉంటే కేంద్ర మంత్రిపై పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి తీసుకొచ్చి విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చాలన్నారు.