- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలను ఒంటరి చేయాలి.. రంగంలోకి ట్రబుల్ షూటర్..!
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ ప్రభావితం చేయగలిగే వ్యవస్థను టీఆర్ఎస్కు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది అధిష్టానం. రాజేందర్‌ను ఒంటరి చేయడంలో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఓ మంత్రికి, మరో మంత్రి స్థాయిలో ఉన్న నేతకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్ మండలాల్లోని ఆయా గ్రామ స్థాయి నాయకులతో కూడా ముఖ్య నాయకులు టచ్‌లోకి వెళ్తున్నారు. రాజేందర్‌కు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు తాయిలాలు కూడా ప్రకటిస్తున్నారని సమాచారం.
నిధులు.. పదవులు..
అభివృద్ధి కోసం నిధుల వరద పారించడమే కాదు నామినేటెడ్ పదవులను కూడా కట్టబెడుతాం అంటూ నియోజకవర్గంలోని వివిధ కేడర్‌లో ఉన్న నాయకులకు పెద్దల నుండి ఫోన్లు వస్తున్నాయి. పార్టీయే లేకుంటే మీకి పదవులు ఉండేవి కాదు కదా, వ్యక్తి కన్న వ్యవస్థ ముఖ్యమని, ఆ వ్యవస్థతోనే కలిసి ఉంటే మీకు బలం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ వారిని బుజ్జగించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్నింటా మీకు అండదండలు అందిస్తాం మీకు ఎలాంటి సాయం కావాలన్నా మాతోనే కలిసి ఉంండాలంటూ ఈటల అనుచరులను సముదాయిస్తు తాయిలాలు ప్రకటిస్తున్నట్టుగా సమాచారం. రెండేళ్ల పాటు అధికారంలో ఉండడంతో పాటు రానున్న కాలంలో టీఆర్ఎస్ మాత్రమే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది, ప్రతిపక్షాల పాత్ర నామమాత్రంగా ఉన్న ఈ సమయంలో మీరు పార్టీని వీడితే రాజకీయ భవిష్యత్తు శూన్యంగా మారుతుందంటూ హుజురాబాద్ కేడర్‌కు ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఈటల అభిమానుల్లో మీమాంస మొదలైనట్టుగా తెలుస్తోంది. అటు వెళ్లాలా ఇటే ఉండి పోవాలా అన్న తర్జన భర్జన మొదలైంది.
అవసరమైతే ట్రబుల్ షూటర్..
హుజురాబాద్‌లో గులాబీ గుబాళింపు తగ్గకుండా ఉండేందుకు అవసరమైతే ట్రబుల్ షూటర్‌గా పేరుపడ్డ మంత్రి హరీష్ రావును కూడా రంగంలోకి దింపే యోచనలో అధినేత ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గ కేడర్ పై అధిష్టానం పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయినట్టయితే హరీష్ రావు సేవల్ని కూడా వాడుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటలకు తన్నీరుకు సాన్నిహిత్యం ఉందన్న ప్రచారం విస్తృతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో హరీష్ ఇమేజ్‌ను కూడా వాడుకున్నట్టయితే హుజురాబాద్ కేడర్‌లో ఉన్న ప్రచారానికి చెక్ పెట్టడంతో పార్టీ మరింత బలపడుతుందన్న భావన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా హుజురాబాద్‌లోని కేడర్‌తో కూడా వ్యక్తిగతంగా హరీష్ రావుకు పరిచయాలు ఉండడం వల్ల ఈటల ప్రాభావాన్ని మరింత తగ్గించవచ్చన్న యోచనలో ఉన్నట్టు సమాచారం.