- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాధ్యత వదిలేసింది.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ మీటింగ్‌లో నాలుగు గంటలపాటు ధాన్యం కొనుగోలు వ్యవహారం గురించి చర్చించామన్నారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణ బాధ్యత కేంద్రానిదే అని, సేకరించిన ఆహార ధాన్యాన్ని ప్రజలందరికీ పంపిణీ చేసేది కేంద్రమేనని తెలిపారు. ఆహార ధాన్యాన్ని నిల్వ చేయాల్సింది కేంద్రమేనని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, పేదల వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. కేంద్రం సామాజిక బాధ్యతను విస్మరించిందని, ధాన్యం కొనలేమంటూ కేంద్రం సామాజిక బాధ్యత వదిలేసిందని కేసీఆర్ విమర్శించారు. ఇంత దిక్కుమాలిన, నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు.
కిషన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు
కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుని రాష్ట్రంపై నెపాన్ని పెడుతోందని, అన్నీ డొంకతిరుగుడు మాటలేనని ఆరోపించారు. కేంద్రం ఓ చిల్లర కొట్టు షావుకారులాగా మాట్లాడకూడదని, లక్ష కోట్లు నష్టం వచ్చినా భరించాలన్నారు. బాయిర్డ్ రైస్ గింజ కూడా తీసుకోబోమని చెప్పేస్తున్నారని, రా రైస్ ఎంత తీసుకుంటారో కూడా చెప్పడం లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ప్రయోజనం లేదని, కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనిపించాలని కేసీఆర్ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి చేతకాని దద్దమ్మ, ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, బాయిల్డ్ రైస్ కొనేలా కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడాలని సూచించారు.