- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్‌లో అసమ్మతి.. మంత్రి మల్లారెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్..
దిశ ప్రతినిధి,మేడ్చల్ : కారులో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ పదవుల కేటాయింపులు కలవర పెడుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో నూతన కమిటీల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరినట్లు కనిపించడంలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారిని పక్కన పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలుకు అనుకూలమైన నేతలకే పార్టీ పదవులను కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతలు, మండల స్థాయి నాయకుల అభిప్రాయం తీసుకోకుండానే పార్టీ పదవులను కేటాయించడం అధికార పార్టీలో కొత్త వివాదాలకు నంది పలుకుతోంది.
సీఎం వద్దకు పేచీ
ఘట్ కేసర్ మండల కమిటీని తనకు తెలియకుండానే ప్రకటించడాన్ని అవమానంగా భావించిన జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడడం జిల్లాలో కలకలం సృష్టించింది. లోకల్ జడ్పీటీసీల అభిప్రాయం కూడా తీసుకోకుండానే మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా మండల కమిటీని ప్రకటించారని జడ్పీ చైర్మన్ ఆరోపించారు. దీంతో మలిపెద్ది, మల్లారెడ్డి గ్రూపుల మధ్య అసమ్మతి మరోసారి బహిర్గతమైంది. రెండు గ్రూపుల మధ్య రగిలిన అసమ్మతి సెగ సీఎం కేసీఆర్ వరకు వెళ్లింది. దీంతో మంత్రి మల్లారెడ్డిని, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు. జిల్లాలో అందరిని కలుపుకొని పోతూ.. పార్టీ పటిష్టతకు పాటుపడాలని, గ్రూపు రాజకీయాలకు తావివ్వరాదని మంత్రిని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
అయితే ఇంత చిన్న విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడం.. ఆయన పిలిచి మందలించడంతో మంత్రి ఆచితూచి వ్యవహారిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇకపోతే సంస్థాగత ఎన్నికలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావించినా జిల్లాలో క్షేత్ర స్థాయిలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే మండల, డివిజన్, గ్రామ కమిటీలను పూర్తి చేసినా .. పలు ప్రాంతాలల్లో గందర గోళ పరిస్థితులే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కమిటీల ఎంపికపై అభ్యంతరం వ్యక్త పరుస్తూ.. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
అధ్యక్ష పీఠంపై ఉత్కంఠ..
పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కీలక నేతలు జిల్లా ప్రెసిడెంట్ కోసం పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పదవి కోసం మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ చార్జీ, మంత్రి స్వయనా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో రేవంత్ రెడ్డిపై ఓటమి పాలైనప్పటికీ, నిరంతరం ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి రాజశేఖర్ రెడ్డి కృషి చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినందున జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పరిచయాలుండడం మంత్రి మల్లారెడ్డికి అల్లుడు కావడంతో ఈయనకే పదవి వచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ మేయర్ బొంతు రామ్మెహన్ సైతం జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ గా ఐదేళ్లపాటు పనిచేసినందున బొంతు రామ్మెహన్‌కు మేడ్చల్ అర్బన్ జిల్లాపై పట్టు ఉంది. వీరితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేరు సైతం జిల్లా ప్రెసిడెంట్ రేసులో వినిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురు, నలుగురు నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మండల, డివిజన్, గ్రామ స్థాయి కమిటీల ఎంపికలో అసమ్మతి బయట పడడంతో జిల్లా కార్యవర్గాన్ని పకడ్బందీగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఎమ్మెల్యేల ఏకాభిప్రాయం మేరకే ఉంటుందని తెలుస్తోంది. తమ సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం ఉండేలా జిల్లా ఎమ్మెల్యేలు జాగ్రత్తలు పడుతూ పావులు కదుపుతున్నారు. అయినా తమకు అనుకూలమైన వ్యక్తే అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడి ఎంపిక వ్యక్తిగత, రాజకీయ పలుకుబడితోపాటు సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.