‘సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి’

by Shyam |
‘సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి’
X

దిశ, నల్లగొండ: కొండపోచమ్మ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి పీఠాధిపతి చిన జీయర్ స్వామిని ఏ హోదాలో ఆహ్వానించారో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని సూర్యాపేట కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న సీఎం.. ఒకే మతం వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. అంతే కానీ, యాగలతో రాలేదని విమర్శించారు. నరహంతకుడు నయీమ్ దోచిన ఆస్తుల చిట్టాను చినజీయర్ స్వామి పీఠంలోనే సీఎం దాచినట్లు వస్తున్న ఆరోపణలకు నేడు బలం చేకూరిందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, సీనియర్ నాయకుడు కొండపల్లి సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు మడిపల్లి విక్రమ్, కక్కిరేని శ్రీనివాస్, కుందమల్ల శేఖర్, కరుణాకర్ రెడ్డి, నరేందర్ నాయుడు, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story