చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్‌‌న్యూస్..

by Shyam |   ( Updated:2021-07-30 06:34:58.0  )
CM-Kcr
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు త్వరలోనే బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా శుక్రవారం ప్రగతిభవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుందో అలానే చేనేత కార్మికులను కాపాడుకుంటామన్నారు. తెలంగాణలో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ అని కేంద్రమే చెప్పిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు పకడ్భంధీగా అమలవుతున్నాయన్నారు. ఎన్నో కష్టాల తరువాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించినదని, కానీ ఇప్పుడు మేమే సిపాయిలం అని కొంతమంది నిద్ర లేచి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014కు ముందు తెలంగాణ వస్తుందని ఎవరూ నమ్మలేదని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed