- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి.. టికాయత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్ ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దును పార్లమెంటు ఆమోదించాలని డిమాండ్ చేస్తూనే గురువారం ఇందిరా పార్క్ వద్ద AIKSCC ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. ‘అదానీ, అంబానీల కనుసన్నల్లోనే కేంద్రం నడుస్తోంది. ఢిల్లీలో ఏడాది పాటు ఉద్యమం చేయడం ఇదే తొలిసారి. కార్పొరేట్ లబ్ధికి మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. సాగు చట్టాల రద్దుపై మాకు అనేక సందేహాలు ఉన్నాయి. బీజేపీకి ఓటు వేయకూడదు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలి. కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలి.’ అని అన్నారు.
అంతేకాకుండా.. రైతు ఉద్యమంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరారు. తెలంగాణలో ధాన్యం సేకరణలో టీఆర్ఎస్ వైఖరి సరిగా లేదని సీఎం కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి అని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.