కేంద్ర మంత్రి షెకావత్‎కు సీఎం జగన్ లేఖ

by srinivas |
కేంద్ర మంత్రి షెకావత్‎కు సీఎం జగన్ లేఖ
X

దిశ, వెబ్‎డెస్క్: తెలుగు రాష్ట్రాల నదీ జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్‎లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ కు ఏపీకి రావాల్సిన నీటి వాటాపై పూర్తి వివరాలతో సీఎం జగన్ లేఖ రాశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే జీవనాధారమని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.

తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. థార్ ఎడారి తర్వాత అతి తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో పడుతుందని అన్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు దుర్భిక్షప్రాంతాల పథకంలో ఉన్నాయని.. ఈ ప్రాంతాలకు 100 టీఎంసీల నీరు కావాలని కోరారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు కనీసం 600 టీఎంసీలు కావాలన్నారు. ఈ అంశాలపై గతేడాది జరిగిన భేటీలో సీఎం కేసీఆర్ అంగీకరించారని గుర్తు చేశారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువగా ఉంటేనే పోతిరెడ్డి పాడు ద్వారా తరలించగలమని తెలిపారు. 44 వేల సామర్ధ్యంతో ఏడాదికి 15 రోజులే ఎత్తిపోసే అవకాశం ఉంటుందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed